Thursday, February 25, 2010

అమెరికాలో ప్రస్తుత సంగతులు

అమెరికా అంటే ఎదో అనుకుంటాం కాని ఎవరైన గొప్పలు పోయేది డబ్బులు ఉన్నప్పుడే సుమండీ.. ఒకసారి డబ్బులకి కొరత వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది.. ఈమద్య ఇక్కడ మంచు ఎక్కువగా పడింది కదా.. గత 30-40 సంవత్సరాలలో ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేదంట.. అసలే ఆర్ద్థిక సంక్షోభంలో లో ఉన్నారు కదా ఇక ఆ రోడ్లపై మంచు తీసే పనులకి ఖజాన కాస్త ఖాళి అయింది.. కొన్ని చోట్ల అయితే చేతులెత్తేసారు.. ఈ మంచు తుఫానులకి చాలా రాష్ట్రాల్లో పంటలు నష్టపోయాయి.. దానితో కూరగాయల ధరలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోయాయి....

అసలు న్యూస్ విందామంటే అన్ని నష్టాల విశేషాలే..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నయ్ సుమండీ.. ఈ సంక్షోభం నన్ను కూడా తగిలింది.. మా మానేజరు తీరిగ్గా పిలిచి బాగా పొగిడి (ఎంటబ్బా ఇంతలా పొగుడుతుందని అనుకున్నా!!) ఇక రేపటినుంచి మనం కలవలేమంటూ చావు కబురు చల్లగా చెప్పింది.... సరేలే ఎం చేస్తాం.. మళ్ళీ ఇంకొ ఉద్యోగం వెదుక్కుందాంలే అనుకొని అన్ని సర్దుకోని వచ్చేసా...

7 comments:

శరత్ కాలమ్ said...

అవునండీ. మేనేజర్ పనిలేకున్నా తన గదిలోకి పిలిచి తలుపు వేసాడంటే భయమే - పింక్ స్లిప్పేమోనని.

మళ్ళీ త్వరలో మీకు ఉద్యోగం రావాలని ఆశిస్తాను.

Change Maker said...

All the best. Market is getting better and lot better than last year

కొత్త పాళీ said...

అయ్యో.
all the best in your search.

పానీపూరి123 said...

All the Best...

Anonymous said...

That's your way of looking at America and only your way of analyzing.... and people like you are just 0.001% of America's population.

Realize why this is still a dreamland - and what's your role in making it so.

This country's wealth and capacity is far beyond our imaginations.

భావన said...

మొత్తానికి D.C వైపు వుంటారన్నమాట మా వైపు ఈ సవత్సరం డబ్బులు మిగిలి పోయాయి స్నొ లేక.. ;-) all the best in finding new job. Market is not that bad. Hope for the best.

అనిత.. said...

@ శరత్ 'కాలం'
@ బాటసారి
@ కొత్తపాళీ
@ పానీపూరి
@భావన

Thnaks for you wishes.

Post a Comment