Friday, August 27, 2010

చాలా రోజుల విరామం తరువాత...

చాలా రోజుల విరామం తరువాత ఇలా మీ ముందుకి వచ్చా.... ఎలా ఉన్నారు ఏం సంగతులు?

Thursday, February 25, 2010

అమెరికాలో ప్రస్తుత సంగతులు

అమెరికా అంటే ఎదో అనుకుంటాం కాని ఎవరైన గొప్పలు పోయేది డబ్బులు ఉన్నప్పుడే సుమండీ.. ఒకసారి డబ్బులకి కొరత వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది.. ఈమద్య ఇక్కడ మంచు ఎక్కువగా పడింది కదా.. గత 30-40 సంవత్సరాలలో ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేదంట.. అసలే ఆర్ద్థిక సంక్షోభంలో లో ఉన్నారు కదా ఇక ఆ రోడ్లపై మంచు తీసే పనులకి ఖజాన కాస్త ఖాళి అయింది.. కొన్ని చోట్ల అయితే చేతులెత్తేసారు.. ఈ మంచు తుఫానులకి చాలా రాష్ట్రాల్లో పంటలు నష్టపోయాయి.. దానితో కూరగాయల ధరలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోయాయి....

అసలు న్యూస్ విందామంటే అన్ని నష్టాల విశేషాలే..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నయ్ సుమండీ.. ఈ సంక్షోభం నన్ను కూడా తగిలింది.. మా మానేజరు తీరిగ్గా పిలిచి బాగా పొగిడి (ఎంటబ్బా ఇంతలా పొగుడుతుందని అనుకున్నా!!) ఇక రేపటినుంచి మనం కలవలేమంటూ చావు కబురు చల్లగా చెప్పింది.... సరేలే ఎం చేస్తాం.. మళ్ళీ ఇంకొ ఉద్యోగం వెదుక్కుందాంలే అనుకొని అన్ని సర్దుకోని వచ్చేసా...

Saturday, January 9, 2010

సమైక్యాంధ్ర విషయంలో వెనక్కి తగ్గిన ఆంధ్రా నాయకులు... ఇంకోసారి మోసపోయిన ప్రజలు

మొన్నటి వరకి తెలంగాణ కావాలని తెలంగాణా నాయకులు, సమైక్యాంధ్ర కావలని సీమాంధ్ర నాయకులు తెగ కంగారు పడిపోయి రాజీనామాలు చేసారు కదా.. ఇప్పుడేమో కేంధ్రం శాంతి జపం మొదలెట్టాక మరి ఎమనుకున్నారో ఎమోగాని అందరూ తమ తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటున్నారంట. ఈ విషయంలో సీమాంధ్ర నాయకులదే పైచేయి అంట.. కాంగ్రెస్ వాళ్ళు మరీ ముందున్నారంట..

వీళ్ళు ఇలా వెనక్కి తీసుకుంటారనే విషయం ముందే తెలిసిన స్పీకర్ గారు వాళ్ళ వాళ్ళ రాజీనామాలని ఆమోదించలేదంట..

మొత్తం మీద ప్రజలని పిచ్చోళ్ళని చేసారు మన నాయకులు... మనల్ని ఇంకోసారి నమ్మించి మోసం చేసారు మన నాయకులు.. ఇదంతా ముందే అంతా కలిసి అడిన నాటకంలా అనిపించట్లేదు మీకు.. ఇలా నమ్మినంత కాలం మనల్ని మోసం చేస్తూనే ఉంటారు

Friday, January 8, 2010

ప్రవాసులకు ఓటు హక్కు కల్పిస్తానన్న మన్మోహన్

స్వదేశంలో ఓటు వేయాలనుకునే ప్రవాస భారతీయుల కల 2014 కి తీరవచ్చు అని మన ప్రధాని మన్మోహన్ నిన్న ఢిల్లి లో జరిగిన ఒక సమావేశంలో నొక్కి వక్కానించారంట. దీనికి సంబందించిన బిల్లుని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారంట(ఈ యోచనకి ఒక జీవిత కాలం పడుతుందేమో)...

పోనీలెండి ఇప్పటికైనా వీళ్ళకి ఈ ఆలోచన వచ్హింది.. ఇన్నాళ్ళు ప్రవాసుల పెట్టూబడుల గురించి మాట్లాడినవాళ్ళు ఇప్పటికైనా మేల్కొని వాళ్ళ ఓటు హక్కు గురించి ఆలోచించారు

TV5 పైన కేసులు ఎత్తివేయాలంట.....

వై.ఎస్.ఆర్ మరణం వెనుక జరిగిన కుట్రలో రిలయన్స్ అధినేత అంబాని పాత్ర ఉందని అదేదో రష్యన్ పత్రిక అప్పుడెప్పుడో రాసిన కథనాన్ని ఆధారం చెసుకొని ప్రసారం చేసిన టివి5 ఛానల్ పై హైదరాబాద్ లోని జూబ్లిహిల్ల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారంట.. వెంటనే ఆ ప్రసారాన్ని నిలిపివేయమని ఆదేశాలు కూడా జారీచేసారంట....

ఇదంతా నిన్న రాత్రి జరిగిన సంగతి... ఇప్పుడు రాష్ట్రం లో జరిగిన విద్వంసానికి టివి5 ఒకవిధంగా కారణమే కదా.. ఇప్పుడు అదేదో యూనియన్ అంట(ఎ.పియు.డబ్లు.జె) ఈ టివి5 వాల్లకి మద్దత్తుగా ఉందంట... టివి5 పైన పెట్టిన కేసులని ఎత్తివేయాలంట.. నిన్న ప్రసారం చేసిన దాంట్లో వీళ్ళ తప్పేం లేదంట..కేసులని ఎత్తివేయకపోతే దర్నాలు చేస్తారంట...

ఆ టివి5 లొ సీనియర్ జర్నలిస్టుని పోలీసులు అరెస్టు చేసారంట .. అది తప్పంట.. అక్కది ఉద్యోగులు అంతా గొడవ గొడవ చేస్తున్నారు.. వీల్లు ప్రసారం చేసారు బాగానే ఉంది ఆ చేసేవాళ్ళు ఎదో (ఒక వేళ ఈ కథనం నిజం అని వాళ్ళు అనుకుంటే ) ఆదారాలు సంపాదించి వాటితో సహా ప్రచారం చేస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా....

Thursday, January 7, 2010

వై.స్.ఆర్ మరణం వెనుక మిస్టరీ ఇదట ...

రాజశేఖరుడి మరణం వెనుక ముకేశ్ అంబాని కుట్ర --- రష్యన్ పత్రిక వెల్లడి


రాజశేఖరుడి మరణం వెనుక ఆ రష్యా వాళ్ళు చెప్పేది నిజమేనా? ఆ రష్యా వాళ్ళు ఎదో రాసారు సరే.. మన మీడియా వాళ్ళు ఏ ఆదారం తో దీన్ని ప్రసారం చేసి జనాల్లో అలజడి స్రుష్ఠించారో ... .

అసలు ఆ పత్రిక ఈ విషయాన్ని వై.స్.ఆర్ మరణించిన తరువాతి రోజే ప్రచురించింది అంట.. అప్పుడు రాసిన దాన్ని పట్టుకొని ఈ టివి5 వాళ్ళు అనవసరం గా ప్రసారం చేసి అలజడి స్రుష్టించారు.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి ఇది ఇంకొక ఇబ్బందిగా మారింది..

రాజశేకరుడి మరణం ఆది నుంచీ అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంది ఆ మద్య టివిల్లో వార్తలు కూడా తెగ వచ్చాయ్ కదా ఇదంతా స్వప్రయోజనాల కోసం ఎవరో ఆడిస్తున్నదని ప్రజలందరికీ తెలిసిన (తెలియనట్టి) నిజం. ఇలా దీని గురించి వెదుకుతూ ఇందాకే బాలసుబ్రమణ్యం గారి టపా చదివా.. మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా ధైర్యంగా రాసారు ఇవన్ని ఎవరూ ఒప్పుకోలేని నిజాలు..


మీడియా వాల్లకి నా విగ్నప్తి : దయచేసి ఊహాజనిత విషయలని ప్రసారం చేసి ప్రజలలో అలజడి స్రిష్టించ వొద్దని మనవి

తెలుగోడిపై వడ్డింపులు మొదలు

ఆర్.టి.సి పెంచిన ధరల విషయం గా అందరూ తెగ కంగారు పడుతున్నారు కాని.. ఈమద్య జరిగిన ఉద్యమంలో ఎన్ని బస్సులను తగలేసారో ఎవడన్నా పట్టించుకున్నాడా.. అప్పుడు ఎవరూ ఆర్.టి.సిని పాపం అని కూడా అనలేదు .. లోకంలో ఏ గోల జరిగినా మొదలు నష్టపోయేది ఆర్.టి.సి నే.. ఇందులో సగపాలు మన మూలంగానే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమంలో అంత నష్టం లేకపోయి ఉంటే ఇంతగా పెంచి ఉండేవారు కాదేమో.. "ఎవడు చేసిన కర్మ వాడనుభవించక తప్పదు" కదా.. ఈ వడ్డింపుల కార్యక్రమం ఇంతటితో ఆగదు ... మన ప్రబుత్వం పన్నులను పెంచుతుందంట కదా ... ప్రతీ ఒక్కరూ తమ ఖజానా ఎలా నింపాలా అని ఎత్తులు వేసేవారే... ఈ ఆర్.టి.సి పెంపు కారణంగా నిత్యావసర వస్తువులు మొదలు ప్రతీ ఒక్కటి ధరలు పెరుగుతాయ్. వీటి మూలంగా ఎక్కువగా నష్టపొయేది సామాన్య మానవుడే

కొసమెరుపేమిటంటే ఈ పెంపు విషయం మన ముఖ్యమంత్రి రోషయ్య గారికి అస్సలు తెలీదంట.. అంతా అయ్యాక ఇప్పుడు తగ్గింపు దిశగా చర్చలు ప్రారంభిస్తామంటున్నారు.. ఎంతవరకి సఫలం అవుతాయో చుద్దాం..

Wednesday, January 6, 2010

కెసిఆర్(జగన్) దీక్ష ఎందుకు మొదలెట్టాడో ఎవరికైనా తెలుసా...

మొన్న ఒక మా cousine తో మాట్లడుతుంటే చెప్పాడు(తనకి తెలిసినవాల్లు ఎవరో టి.ఆర్.స్ లొ అబ్యర్థి అంట) అసలు ఈ కెసిఆర్ కి వైస్.జగన్ డబ్బులు ఇచ్చి దీక్ష చెయ్యమని చెప్పాడంట... ఈమద్య జగన్ వాళ్ళ కంపెనీల గురించి దర్యాప్తు ఎక్కువైంది కదా ఈ విషయాన్ని దారి మల్లించడానికి, ఇంకా ఎవో కొన్ని personnel పనుల కోసం కెసిఆర్ ని కూర్చోపెట్టాడంట తెలంగాణా అని ..

కాకపోతే వాల్లు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఇక్కడ ఇప్పుడేమో ఈ ఉద్యమం కెసీర్ చేతుల్లోంచి స్టూడెంట్స్ చేతుల్లోకి వచ్చింది కదా మల్లి ఇప్పుదు దాన్ని తన చేతుల్లోకి ఎలా తెచ్హుకోవాలా అని కెసిఆర్ తెగ బాధపడుతున్నాడంట ...

ఇది ఎంతవరకి నిజమో నాకు తెలీదు నేను విన్న సంగతి మీకు చెప్తున్నా అంతే ....

మన రాష్ట్రంలోని పరిస్థితులపై మీ స్పందన...

ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితులు ఎటు వెళ్తున్నాయో తెలీకుండా ఉంది కొందరేమో తెలంగాణా కావలంటారు, ఇంకొందరు సమైక్యాంద్ర అంటారు, మరికొందరు ప్రత్యేకాంద్ర అంటారు.. ఎవరు ఎన్ని అన్నా పైకి కనిపించేవి ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంద్ర విషయాలు మాత్రమే.

నిన్న జయప్రకాష్ నారయణ చెప్పినట్టు " ఆంధ్రప్రదేశ్ ను విడదీయాలనుకుంటే ముందు వద్దు అనేవారి సమస్యలని పరిష్కరించాలి ఒకవేళ సమైక్యాంధ్ర కవలనుకుంటే విడదీయాలనేవారి సమస్యలని పరిష్కరించాలి "

అసలు ముందు మన సమస్యలని వినకుండా మాకు ఇది కావలి మాకు అది కావాలి అంటారే తప్ప ఉన్న సమస్యని ఎలా పరిష్కరించాలో ఎవరూ చెప్పరు కదా ఇలా ఐతె ఎలాగో ఎమొ.. అసలు ఈ ఉద్యమం ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుందో కదా...

Monday, January 4, 2010

ఎర్ర గౌను

నేను చిన్నప్పుడు ప్రతీ వేసవి సెలవులకి మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తుండేదాన్ని.. మరిపెడ అని వరంగల్ జిల్లా లో ఉంటుంది.. అమ్మమ్మ గారి ఇల్లు చాలా పెద్దది.. చక్కని ఇల్లు ఇంటి చుట్టూ పెద్ద పెరడు ఒక మంచి నీళ్ళ బావి అనేక రకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు చాలా ప్రశాంతంగా ఉండేది ఆ ప్రదేశం. మా ఇల్లు ఊరికి చివర ఉండేది ఎంచక్కా మా పెరడు లోంచి పొలాల్లోకి దారి కూడా ఉండేది ఇంటి పక్కనే ఒక శివాలయం కుడా ఉండేది .. ఇంక చెప్పేదేముంది కోడి కూయకముందే సందడి మొదలు అక్కడ... వచ్చేవాళ్ళు పొయ్యేవాళ్ళు, పొలం పనులు, పశువుల్ని తోలుకెళ్ళేవాల్లు అబ్బో ఉదయం ఐదు దాటితే చచ్చినట్టు నిద్ర లేవల్సిందే... నేను మా తాతయ్య ఉదయన్నే లేచి తాటి తోపులోకి వెళ్ళేవాల్లం లేత ముంజల కోసం.... మామిడికాయల కాలం మొదలైదంటే చక్కగా మామిడి తోటలొకే.. ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, ముగ్గురు పిన్నిలు, మామయ్య ఉండేవాళ్ళు.. నేను చిన్నపిల్లని కదా కనుక మనదే రాజ్యం అక్కడ.. తాతయ్య ధాన్యం వ్యాపారం చేస్తుండేవాళ్ళు రైతుల వద్ద కొని మార్కెట్టులో అమ్మడం అన్నమాట.. మా ఊరికి చుట్టుపక్కల ఎక్కువగా తండాలు ఉండేవి అక్కడ లంబాడీలు ఎక్కువగా ఉండేవాల్లు నేను కూడా వెల్తుండేదాన్ని అక్కడికి మా తాతయ్యతో పాటు..

అప్పుడు నాకు ఓ ఏడేళ్ళు ఉంటాయనుకుంటా మా తాతయ్య కొట్టులో ఉన్నారు.. అమ్మమ్మ నన్ను ఎదొ ఇచ్చి రమ్మని పంపించింది తాతయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా తీసుకెళ్ళమని చెప్పింది కూడా.. నేనెమో నేను ఎం చిన్నపిల్లని కాదు నేను ఒక్కదాన్నే వెళ్తా అని చెప్పి బయలుదేరాను వెల్లేటప్పుదు బాగానే వెళ్ళాను తిరిగి ఇంటికి వచ్చెటప్పుడు ఇంటికి కొట్టుకి ఒక 15 నిమిషాలు నడక ఉంటుంది ... కాస్త దూరం వచ్చాక నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసా ఎవరో రెండు ఎద్దులని తోలుకెతున్నారు కొంచం భయం వేసింది నడక వేగం పెంచాను నాకు ఎద్దులంటే భయం నన్ను చూసి అవి కుడా వేగం పెంచాయ్ వాటి కాపలావాడేమో వాటిని ఆపలేకపోతున్నాడు నేను భయం కొద్ది పరుగెత్తసాగాను అవి నన్ను వెంబడిస్తున్నాయ్ నేను ఏడుస్తూ పరుగు పెడుతున్నాను అప్పుడే అకస్మాత్తుగా ఒక స్వరం వినిపించింది అయ్యో అదేంటి అమ్మాయ్ ఎర్ర గౌను వేసుకొని అలా పరిగెడుతున్నావ్ వాటికి ఎరుపు అంటే పడదు కదా అన్నారు.. అంతే నాలో ఉన్న భయం రెట్టింపైంది ఒకటే పరుగు ముందు నేను వెనక అవి ... ఒకటే అరుపులు మధ్యలో జానకమ్మ గారి ఇల్లు కనిపిస్తే అందులో దూరిపొయా ఆ కంగారులో గేటు వేయడం మర్చిపొయా అంతే అవి కూడా నాతో పాటు వొచ్చేసాయ్ మన పల్లెటూరు లొ గేటులు పెద్దవి ఉంటాయ్ కదండి .. ఇక చూస్కోండి మళ్ళీ బయటికి పరుగు అలా పరిగెత్తి పరిగెత్తి ఊరంత 2 చుట్లు వేసాను ఎలగోలా తప్పించుకొని మా ఇల్లు చేరాను ఎవరో చూసి నన్ను లొపలికి తీసుకెల్లారు.. వాళ్ళు కూడా గేటు వేయడం మర్చిపొయినట్టు ఉన్నారు అవి లోపలికి వచ్హి చేసిన నాశనం అంతా ఇంతా కాదు ఇంతలో ఎవరో మహానుభావులు వొచ్హి వాటికి తెలుపు గుడ్డ చూపించి వాటిని శాంత పరిచారు.. నేనైతే అమ్మమ్మని చుట్టేసి భయంతో వణికిపోతూ ఒకటే ఏడుపు జ్వరం కూడా వొచ్చేసింది ఇంతలో ఈ విషయం మా తాతయ్యకి తెలిసి పరిగెత్తుకుంటూ వొచ్చేసారు అమ్మమ్మని ఒకటే తిట్లు నేను ఆ భయంలో కూడా " అమ్మమ్మని తిట్టొద్దు తన తప్పేం లేదు" అని అరిచాను. అంతే ఒక్కటిచ్చారు మా తాతయ్య.. తరవాత దగ్గరికి తీసుకొని ముద్దు చేసారనుకోండి అప్పటి భయం నాకు ఇప్పటి వరకి పోలేదనుకోండి ఇప్పటికి కూడ ఎద్దుని చూస్తే 1 కిలోమీటరు దూరంలో ఉంటాను.. ఎరుపు బట్టల వైపు అస్సలు చూడను.. ఇక అప్పటి నించి ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా ఒక్కదాన్ని ఎక్కడికీ వెళ్ళలేదు ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళేదాన్ని.. ఇదండీ ఎర్ర గౌను అనుభవం ..