Friday, January 8, 2010

ప్రవాసులకు ఓటు హక్కు కల్పిస్తానన్న మన్మోహన్

స్వదేశంలో ఓటు వేయాలనుకునే ప్రవాస భారతీయుల కల 2014 కి తీరవచ్చు అని మన ప్రధాని మన్మోహన్ నిన్న ఢిల్లి లో జరిగిన ఒక సమావేశంలో నొక్కి వక్కానించారంట. దీనికి సంబందించిన బిల్లుని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారంట(ఈ యోచనకి ఒక జీవిత కాలం పడుతుందేమో)...

పోనీలెండి ఇప్పటికైనా వీళ్ళకి ఈ ఆలోచన వచ్హింది.. ఇన్నాళ్ళు ప్రవాసుల పెట్టూబడుల గురించి మాట్లాడినవాళ్ళు ఇప్పటికైనా మేల్కొని వాళ్ళ ఓటు హక్కు గురించి ఆలోచించారు

1 comments:

Anonymous said...

ఇది మాత్రం నిజంగా కాకి కబురే... 14 ఏళ్ళ నుండీ వింటున్నాను...

నిజామాబాద్లో నాకు ఓటు హక్కు వచ్చిన తరువాత మొదటిసారి ఓటేయడానికి వెళ్ళినప్పుడు తగిలిన షాక్... ఎవరో నా పేరుమీద ఓటు వేసేసారు. ఎందుకలా అని నిలదీస్తే బయటకి తరిమేసారు. అదే చివరిసారి నేను ఓటేయడానికి ప్రయత్నం చేయడం కూడా - కొన్నాళ్ళకు ట్.ఎన్.శేషన్ ప్రవాసులకు ఓటు హక్కు కల్పించడానికి పూనుకున్నపుడు, ఏదో మంచి జరుగుతుందని ఊహించాను. ఆయన్ను పక్కకు జరపగానే ఆ అలోచన కాస్త మరుగున పడిన దగ్గరనుండి ఈ చేవలేని చేతకాని నాయకులు ప్రగల్బాలు పలుకుతూనే ఉన్నారు. చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో.

Post a Comment