Thursday, December 31, 2009

ఇంగ్లీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఏంటో మనం అంతా మన తెలుగు పండగని మాత్రం ఇంత హంగామ చేసి జరపం కాని ఈ ఇంగ్లీషోళ్ళ పండగని మాత్రం చాలా హంగమా చేసేస్తుంటాం.... ఏం చేస్తాం అంతా కళికాలం... ఇంగ్లీషోళ్ళ పవర్ అలాంటిది... ఎంత ఐనా ఎంత హంగమా చేసినా మన తెలుగు పండగలా ఉంటుందా చెప్పండి ... ఎవో ఆటలు, పాటలు, కేకులు ఎంత చేసిన మన ఉగాది కి సరిపోవనుకోండి. సరేలెండి ఎన్ని అనుకున్నా ఏముందిలెండి మీ అందరికీ ఈ ఇంగ్లీష్ నూతన సంవత్సరం లో అన్ని శుభాలు జరగాలని, ఈ అర్ధికమాంద్యం నుంచి ఈ ప్రపంచం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ..

Tuesday, December 29, 2009

ఒక రోజు ఏమయిదంటే....

సాదారణంగా మన ఊర్లొ ఐతే ఎవరైనా మన ఇంటికి వొస్తే మంచినీళ్ళు, మజ్జిగ లేదా పళ్ళరసం ఇస్తాం.. అలసిపొయి వొస్తారేమో అని కాస్త సేద తీర్చుకోమని కదా...

కాని నేను మొదట అమెరికాకి వొచ్హినప్పుడు ఒక సహోద్యోగి వాళ్ళ ఇంటికి భోజననికి పిలిస్తే వెళ్ళాను.. ఇలా వెళ్ళగానే ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో వాళ్ళ అవిడ వొచ్హ్హి "would you like to have some wine" అంది అంతే నేను షాక్ .. ఇక్కడ ఈ ఫెసిలిటి కుడా ఉందా అని... ( మరి నేను వొచ్హింది తెల్లవాళ్ళ ఇంటికి కదా )

అప్పుడెదో సర్దుకున్నా కాని ఇక ఇంటికి వొచ్హాక అసలు నవ్వు ఆగలేదనుకోండి నాకు...

మొదటి టపా

ఎప్పటినుంచో ఒక బ్లాగు రాద్దమనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది మరి... సరే అని ఇలా మొదలెట్టా

ఇంతకీ ఎలా మొదలెట్టాలో ... ఏం రాయాలో ఇంకా ఆలోచించలేదండీ
మరి కాకీక కబుర్లు అని పేరెందుకంటారా... ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా ఒక సన్నివేశం మెరిసింది నా బుర్రలో అదేంటంటే అప్పుడెప్ప్పుడో చిన్న్నప్పుడు ఒక స్నేహితుడితో మాటల్లొ మాటగా ఒక పందెం వేసుకున్నాం ఏంటంటే ఒకే అక్షరం ఉపయొగించి ఒక వాక్యం చెప్పలి అని అలా అలోచిస్తూ ఉండగా ఉండగా కొన్ని వాక్యాలు మెరిసాయ్ బుర్రకాయలో అందులొ ఒకటే ఇది " కాకీక కాకికి కాక కుక్కకా ".. ఇంకోటి కూడ ఉందండోయ్ " నీ నూనె నా నూనెనని నేను నిన్నన్ననా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె " ........!!!!!!@@@@@######

ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక... కాకీక కబుర్లు అని నిర్ణయించుకొని ఈ పేరు కరారు చేసా అన్నమాట

అదండీ సంగతి ..
ఎవైనా తప్పులు దొర్లితే సాయం చేస్తారు కదూ!
--
ఇట్లు
మీ అనిత.