Tuesday, December 29, 2009

మొదటి టపా

ఎప్పటినుంచో ఒక బ్లాగు రాద్దమనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది మరి... సరే అని ఇలా మొదలెట్టా

ఇంతకీ ఎలా మొదలెట్టాలో ... ఏం రాయాలో ఇంకా ఆలోచించలేదండీ
మరి కాకీక కబుర్లు అని పేరెందుకంటారా... ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా ఒక సన్నివేశం మెరిసింది నా బుర్రలో అదేంటంటే అప్పుడెప్ప్పుడో చిన్న్నప్పుడు ఒక స్నేహితుడితో మాటల్లొ మాటగా ఒక పందెం వేసుకున్నాం ఏంటంటే ఒకే అక్షరం ఉపయొగించి ఒక వాక్యం చెప్పలి అని అలా అలోచిస్తూ ఉండగా ఉండగా కొన్ని వాక్యాలు మెరిసాయ్ బుర్రకాయలో అందులొ ఒకటే ఇది " కాకీక కాకికి కాక కుక్కకా ".. ఇంకోటి కూడ ఉందండోయ్ " నీ నూనె నా నూనెనని నేను నిన్నన్ననా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె " ........!!!!!!@@@@@######

ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక... కాకీక కబుర్లు అని నిర్ణయించుకొని ఈ పేరు కరారు చేసా అన్నమాట

అదండీ సంగతి ..
ఎవైనా తప్పులు దొర్లితే సాయం చేస్తారు కదూ!
--
ఇట్లు
మీ అనిత.

3 comments:

తెలుగుకళ said...

:) కాకీక కాకికి కాక కేకికా ?
కేకి అంటే నెమలి అని అర్థం. ఈ వాక్యాన్ని చమత్కారంగా ఉపయోగించిన వారు తెనాలి రామలింగడు.
(కుక్కకి ఈకలుండవుకదా !)
అడిగారు కదా అందుకే చెప్పాను. అన్యధాబావించకండి.
all the best for your new blog !

అనిత said...

@ తెలుగుకళ ధన్యవాదములండీ బాగాచెప్పారు

India Education Help said...

hi this is somthing different. keep roking

Post a Comment