Monday, January 4, 2010

ఎర్ర గౌను

నేను చిన్నప్పుడు ప్రతీ వేసవి సెలవులకి మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తుండేదాన్ని.. మరిపెడ అని వరంగల్ జిల్లా లో ఉంటుంది.. అమ్మమ్మ గారి ఇల్లు చాలా పెద్దది.. చక్కని ఇల్లు ఇంటి చుట్టూ పెద్ద పెరడు ఒక మంచి నీళ్ళ బావి అనేక రకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు చాలా ప్రశాంతంగా ఉండేది ఆ ప్రదేశం. మా ఇల్లు ఊరికి చివర ఉండేది ఎంచక్కా మా పెరడు లోంచి పొలాల్లోకి దారి కూడా ఉండేది ఇంటి పక్కనే ఒక శివాలయం కుడా ఉండేది .. ఇంక చెప్పేదేముంది కోడి కూయకముందే సందడి మొదలు అక్కడ... వచ్చేవాళ్ళు పొయ్యేవాళ్ళు, పొలం పనులు, పశువుల్ని తోలుకెళ్ళేవాల్లు అబ్బో ఉదయం ఐదు దాటితే చచ్చినట్టు నిద్ర లేవల్సిందే... నేను మా తాతయ్య ఉదయన్నే లేచి తాటి తోపులోకి వెళ్ళేవాల్లం లేత ముంజల కోసం.... మామిడికాయల కాలం మొదలైదంటే చక్కగా మామిడి తోటలొకే.. ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, ముగ్గురు పిన్నిలు, మామయ్య ఉండేవాళ్ళు.. నేను చిన్నపిల్లని కదా కనుక మనదే రాజ్యం అక్కడ.. తాతయ్య ధాన్యం వ్యాపారం చేస్తుండేవాళ్ళు రైతుల వద్ద కొని మార్కెట్టులో అమ్మడం అన్నమాట.. మా ఊరికి చుట్టుపక్కల ఎక్కువగా తండాలు ఉండేవి అక్కడ లంబాడీలు ఎక్కువగా ఉండేవాల్లు నేను కూడా వెల్తుండేదాన్ని అక్కడికి మా తాతయ్యతో పాటు..

అప్పుడు నాకు ఓ ఏడేళ్ళు ఉంటాయనుకుంటా మా తాతయ్య కొట్టులో ఉన్నారు.. అమ్మమ్మ నన్ను ఎదొ ఇచ్చి రమ్మని పంపించింది తాతయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా తీసుకెళ్ళమని చెప్పింది కూడా.. నేనెమో నేను ఎం చిన్నపిల్లని కాదు నేను ఒక్కదాన్నే వెళ్తా అని చెప్పి బయలుదేరాను వెల్లేటప్పుదు బాగానే వెళ్ళాను తిరిగి ఇంటికి వచ్చెటప్పుడు ఇంటికి కొట్టుకి ఒక 15 నిమిషాలు నడక ఉంటుంది ... కాస్త దూరం వచ్చాక నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసా ఎవరో రెండు ఎద్దులని తోలుకెతున్నారు కొంచం భయం వేసింది నడక వేగం పెంచాను నాకు ఎద్దులంటే భయం నన్ను చూసి అవి కుడా వేగం పెంచాయ్ వాటి కాపలావాడేమో వాటిని ఆపలేకపోతున్నాడు నేను భయం కొద్ది పరుగెత్తసాగాను అవి నన్ను వెంబడిస్తున్నాయ్ నేను ఏడుస్తూ పరుగు పెడుతున్నాను అప్పుడే అకస్మాత్తుగా ఒక స్వరం వినిపించింది అయ్యో అదేంటి అమ్మాయ్ ఎర్ర గౌను వేసుకొని అలా పరిగెడుతున్నావ్ వాటికి ఎరుపు అంటే పడదు కదా అన్నారు.. అంతే నాలో ఉన్న భయం రెట్టింపైంది ఒకటే పరుగు ముందు నేను వెనక అవి ... ఒకటే అరుపులు మధ్యలో జానకమ్మ గారి ఇల్లు కనిపిస్తే అందులో దూరిపొయా ఆ కంగారులో గేటు వేయడం మర్చిపొయా అంతే అవి కూడా నాతో పాటు వొచ్చేసాయ్ మన పల్లెటూరు లొ గేటులు పెద్దవి ఉంటాయ్ కదండి .. ఇక చూస్కోండి మళ్ళీ బయటికి పరుగు అలా పరిగెత్తి పరిగెత్తి ఊరంత 2 చుట్లు వేసాను ఎలగోలా తప్పించుకొని మా ఇల్లు చేరాను ఎవరో చూసి నన్ను లొపలికి తీసుకెల్లారు.. వాళ్ళు కూడా గేటు వేయడం మర్చిపొయినట్టు ఉన్నారు అవి లోపలికి వచ్హి చేసిన నాశనం అంతా ఇంతా కాదు ఇంతలో ఎవరో మహానుభావులు వొచ్హి వాటికి తెలుపు గుడ్డ చూపించి వాటిని శాంత పరిచారు.. నేనైతే అమ్మమ్మని చుట్టేసి భయంతో వణికిపోతూ ఒకటే ఏడుపు జ్వరం కూడా వొచ్చేసింది ఇంతలో ఈ విషయం మా తాతయ్యకి తెలిసి పరిగెత్తుకుంటూ వొచ్చేసారు అమ్మమ్మని ఒకటే తిట్లు నేను ఆ భయంలో కూడా " అమ్మమ్మని తిట్టొద్దు తన తప్పేం లేదు" అని అరిచాను. అంతే ఒక్కటిచ్చారు మా తాతయ్య.. తరవాత దగ్గరికి తీసుకొని ముద్దు చేసారనుకోండి అప్పటి భయం నాకు ఇప్పటి వరకి పోలేదనుకోండి ఇప్పటికి కూడ ఎద్దుని చూస్తే 1 కిలోమీటరు దూరంలో ఉంటాను.. ఎరుపు బట్టల వైపు అస్సలు చూడను.. ఇక అప్పటి నించి ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా ఒక్కదాన్ని ఎక్కడికీ వెళ్ళలేదు ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళేదాన్ని.. ఇదండీ ఎర్ర గౌను అనుభవం ..

9 comments:

Shankar Reddy said...

బాగుంది అనుభవం

ప్రేరణ... said...

బాగుంది..

చిలమకూరు విజయమోహన్ said...

ఇంత భయం కలిగించే అనుభవం బాగుండడమేమిటి,పాపం ఎంత ఇబ్బంది పడ్డారో!

అనిత said...

@ చిలకమూరు మీరొక్కరే సరిగ్గా అర్థం చేసుకున్నారు

Malakpet Rowdy said...

ఎద్దులకి ఎరుపుకి ఆకుపచ్చకి తేడా తెలియదండీ. ఎర్ర జెండా చూసి ఎద్దు పరిగెత్తడానికి కారణం, అది కదులుతుండడమేగానీ, ఎర్ర బట్ట వల్ల కాదు.

అనిత.... said...

@ Malakpet Rowdy
లేదండీ ఎద్దులకి ఎరుపు రంగు పడదు కావలంటే పల్లెటూరు లో ఎవరినైనా కనుక్కోండి

KumarN said...

హ్మ్మ్..మీది మరిపెడ నా? మీ ఊరికి చాలా సార్లు వచ్చానండోయ్. లంబాడీ వాళ్ళు మా మామయ్య ఇంటికి కూడా మామిడి పళ్ళు చాలా తెచి ఇచ్చే వారు. ఇంతకీ అమెరికాలో ఎక్కడుంటున్నారు?

అనిత.. said...

@ KumarN అవునా!! మరిపెడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు.. ఇప్పుడు నేను MD లో ఉంటున్నాను.... మీరు..?
ఇంతకీ మీ మామయ్య పేరు..?

laxman said...

hi, maripeda lo unna me tatagari peru emitandi

Post a Comment