Friday, January 8, 2010

TV5 పైన కేసులు ఎత్తివేయాలంట.....

వై.ఎస్.ఆర్ మరణం వెనుక జరిగిన కుట్రలో రిలయన్స్ అధినేత అంబాని పాత్ర ఉందని అదేదో రష్యన్ పత్రిక అప్పుడెప్పుడో రాసిన కథనాన్ని ఆధారం చెసుకొని ప్రసారం చేసిన టివి5 ఛానల్ పై హైదరాబాద్ లోని జూబ్లిహిల్ల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారంట.. వెంటనే ఆ ప్రసారాన్ని నిలిపివేయమని ఆదేశాలు కూడా జారీచేసారంట....

ఇదంతా నిన్న రాత్రి జరిగిన సంగతి... ఇప్పుడు రాష్ట్రం లో జరిగిన విద్వంసానికి టివి5 ఒకవిధంగా కారణమే కదా.. ఇప్పుడు అదేదో యూనియన్ అంట(ఎ.పియు.డబ్లు.జె) ఈ టివి5 వాల్లకి మద్దత్తుగా ఉందంట... టివి5 పైన పెట్టిన కేసులని ఎత్తివేయాలంట.. నిన్న ప్రసారం చేసిన దాంట్లో వీళ్ళ తప్పేం లేదంట..కేసులని ఎత్తివేయకపోతే దర్నాలు చేస్తారంట...

ఆ టివి5 లొ సీనియర్ జర్నలిస్టుని పోలీసులు అరెస్టు చేసారంట .. అది తప్పంట.. అక్కది ఉద్యోగులు అంతా గొడవ గొడవ చేస్తున్నారు.. వీల్లు ప్రసారం చేసారు బాగానే ఉంది ఆ చేసేవాళ్ళు ఎదో (ఒక వేళ ఈ కథనం నిజం అని వాళ్ళు అనుకుంటే ) ఆదారాలు సంపాదించి వాటితో సహా ప్రచారం చేస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా....

4 comments:

Harsha said...

ముందు అ యూనియన్ వాళ్ళని కూడా బొక్కలో వేస్తే దరిద్రం వదులుతుంది

Anonymous said...

అన్ని టివి చానల్స పైన కేసులు నమోదుచేయ్యాలి.ఎందుకంటె ఈ విషయాన్ని అన్ని చానల్సు ప్రసారంచెసారు. ఒక్క tv5 మాత్రమె దోషి కాదు. tv9 సాక్షి etv2 ntv abn అందరి మీద కేసులు నమోదుచేయ్యాలి

అనిత.... said...

@Harsh
బాగా చెప్పారు. ఆ యూనియన్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తే తరువాత జరిగేది అదేనేమో....
@Anonymous
కాకపోతే తొలుత ప్రసారం చేసింది వాళ్ళే కదా.. అందుకని వాళ్ళ పైన కేసు నమోదు చేసి ఉండొచ్చు...

Anonymous said...

అనిత గారు అందరు దొంగలె పిల్లి మెడలొ గంట tv5 వాళ్ళు కట్టారు.

Post a Comment