Wednesday, January 6, 2010

కెసిఆర్(జగన్) దీక్ష ఎందుకు మొదలెట్టాడో ఎవరికైనా తెలుసా...

మొన్న ఒక మా cousine తో మాట్లడుతుంటే చెప్పాడు(తనకి తెలిసినవాల్లు ఎవరో టి.ఆర్.స్ లొ అబ్యర్థి అంట) అసలు ఈ కెసిఆర్ కి వైస్.జగన్ డబ్బులు ఇచ్చి దీక్ష చెయ్యమని చెప్పాడంట... ఈమద్య జగన్ వాళ్ళ కంపెనీల గురించి దర్యాప్తు ఎక్కువైంది కదా ఈ విషయాన్ని దారి మల్లించడానికి, ఇంకా ఎవో కొన్ని personnel పనుల కోసం కెసిఆర్ ని కూర్చోపెట్టాడంట తెలంగాణా అని ..

కాకపోతే వాల్లు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఇక్కడ ఇప్పుడేమో ఈ ఉద్యమం కెసీర్ చేతుల్లోంచి స్టూడెంట్స్ చేతుల్లోకి వచ్చింది కదా మల్లి ఇప్పుదు దాన్ని తన చేతుల్లోకి ఎలా తెచ్హుకోవాలా అని కెసిఆర్ తెగ బాధపడుతున్నాడంట ...

ఇది ఎంతవరకి నిజమో నాకు తెలీదు నేను విన్న సంగతి మీకు చెప్తున్నా అంతే ....

మన రాష్ట్రంలోని పరిస్థితులపై మీ స్పందన...

ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితులు ఎటు వెళ్తున్నాయో తెలీకుండా ఉంది కొందరేమో తెలంగాణా కావలంటారు, ఇంకొందరు సమైక్యాంద్ర అంటారు, మరికొందరు ప్రత్యేకాంద్ర అంటారు.. ఎవరు ఎన్ని అన్నా పైకి కనిపించేవి ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంద్ర విషయాలు మాత్రమే.

నిన్న జయప్రకాష్ నారయణ చెప్పినట్టు " ఆంధ్రప్రదేశ్ ను విడదీయాలనుకుంటే ముందు వద్దు అనేవారి సమస్యలని పరిష్కరించాలి ఒకవేళ సమైక్యాంధ్ర కవలనుకుంటే విడదీయాలనేవారి సమస్యలని పరిష్కరించాలి "

అసలు ముందు మన సమస్యలని వినకుండా మాకు ఇది కావలి మాకు అది కావాలి అంటారే తప్ప ఉన్న సమస్యని ఎలా పరిష్కరించాలో ఎవరూ చెప్పరు కదా ఇలా ఐతె ఎలాగో ఎమొ.. అసలు ఈ ఉద్యమం ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుందో కదా...

Monday, January 4, 2010

ఎర్ర గౌను

నేను చిన్నప్పుడు ప్రతీ వేసవి సెలవులకి మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తుండేదాన్ని.. మరిపెడ అని వరంగల్ జిల్లా లో ఉంటుంది.. అమ్మమ్మ గారి ఇల్లు చాలా పెద్దది.. చక్కని ఇల్లు ఇంటి చుట్టూ పెద్ద పెరడు ఒక మంచి నీళ్ళ బావి అనేక రకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు చాలా ప్రశాంతంగా ఉండేది ఆ ప్రదేశం. మా ఇల్లు ఊరికి చివర ఉండేది ఎంచక్కా మా పెరడు లోంచి పొలాల్లోకి దారి కూడా ఉండేది ఇంటి పక్కనే ఒక శివాలయం కుడా ఉండేది .. ఇంక చెప్పేదేముంది కోడి కూయకముందే సందడి మొదలు అక్కడ... వచ్చేవాళ్ళు పొయ్యేవాళ్ళు, పొలం పనులు, పశువుల్ని తోలుకెళ్ళేవాల్లు అబ్బో ఉదయం ఐదు దాటితే చచ్చినట్టు నిద్ర లేవల్సిందే... నేను మా తాతయ్య ఉదయన్నే లేచి తాటి తోపులోకి వెళ్ళేవాల్లం లేత ముంజల కోసం.... మామిడికాయల కాలం మొదలైదంటే చక్కగా మామిడి తోటలొకే.. ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, ముగ్గురు పిన్నిలు, మామయ్య ఉండేవాళ్ళు.. నేను చిన్నపిల్లని కదా కనుక మనదే రాజ్యం అక్కడ.. తాతయ్య ధాన్యం వ్యాపారం చేస్తుండేవాళ్ళు రైతుల వద్ద కొని మార్కెట్టులో అమ్మడం అన్నమాట.. మా ఊరికి చుట్టుపక్కల ఎక్కువగా తండాలు ఉండేవి అక్కడ లంబాడీలు ఎక్కువగా ఉండేవాల్లు నేను కూడా వెల్తుండేదాన్ని అక్కడికి మా తాతయ్యతో పాటు..

అప్పుడు నాకు ఓ ఏడేళ్ళు ఉంటాయనుకుంటా మా తాతయ్య కొట్టులో ఉన్నారు.. అమ్మమ్మ నన్ను ఎదొ ఇచ్చి రమ్మని పంపించింది తాతయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా తీసుకెళ్ళమని చెప్పింది కూడా.. నేనెమో నేను ఎం చిన్నపిల్లని కాదు నేను ఒక్కదాన్నే వెళ్తా అని చెప్పి బయలుదేరాను వెల్లేటప్పుదు బాగానే వెళ్ళాను తిరిగి ఇంటికి వచ్చెటప్పుడు ఇంటికి కొట్టుకి ఒక 15 నిమిషాలు నడక ఉంటుంది ... కాస్త దూరం వచ్చాక నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసా ఎవరో రెండు ఎద్దులని తోలుకెతున్నారు కొంచం భయం వేసింది నడక వేగం పెంచాను నాకు ఎద్దులంటే భయం నన్ను చూసి అవి కుడా వేగం పెంచాయ్ వాటి కాపలావాడేమో వాటిని ఆపలేకపోతున్నాడు నేను భయం కొద్ది పరుగెత్తసాగాను అవి నన్ను వెంబడిస్తున్నాయ్ నేను ఏడుస్తూ పరుగు పెడుతున్నాను అప్పుడే అకస్మాత్తుగా ఒక స్వరం వినిపించింది అయ్యో అదేంటి అమ్మాయ్ ఎర్ర గౌను వేసుకొని అలా పరిగెడుతున్నావ్ వాటికి ఎరుపు అంటే పడదు కదా అన్నారు.. అంతే నాలో ఉన్న భయం రెట్టింపైంది ఒకటే పరుగు ముందు నేను వెనక అవి ... ఒకటే అరుపులు మధ్యలో జానకమ్మ గారి ఇల్లు కనిపిస్తే అందులో దూరిపొయా ఆ కంగారులో గేటు వేయడం మర్చిపొయా అంతే అవి కూడా నాతో పాటు వొచ్చేసాయ్ మన పల్లెటూరు లొ గేటులు పెద్దవి ఉంటాయ్ కదండి .. ఇక చూస్కోండి మళ్ళీ బయటికి పరుగు అలా పరిగెత్తి పరిగెత్తి ఊరంత 2 చుట్లు వేసాను ఎలగోలా తప్పించుకొని మా ఇల్లు చేరాను ఎవరో చూసి నన్ను లొపలికి తీసుకెల్లారు.. వాళ్ళు కూడా గేటు వేయడం మర్చిపొయినట్టు ఉన్నారు అవి లోపలికి వచ్హి చేసిన నాశనం అంతా ఇంతా కాదు ఇంతలో ఎవరో మహానుభావులు వొచ్హి వాటికి తెలుపు గుడ్డ చూపించి వాటిని శాంత పరిచారు.. నేనైతే అమ్మమ్మని చుట్టేసి భయంతో వణికిపోతూ ఒకటే ఏడుపు జ్వరం కూడా వొచ్చేసింది ఇంతలో ఈ విషయం మా తాతయ్యకి తెలిసి పరిగెత్తుకుంటూ వొచ్చేసారు అమ్మమ్మని ఒకటే తిట్లు నేను ఆ భయంలో కూడా " అమ్మమ్మని తిట్టొద్దు తన తప్పేం లేదు" అని అరిచాను. అంతే ఒక్కటిచ్చారు మా తాతయ్య.. తరవాత దగ్గరికి తీసుకొని ముద్దు చేసారనుకోండి అప్పటి భయం నాకు ఇప్పటి వరకి పోలేదనుకోండి ఇప్పటికి కూడ ఎద్దుని చూస్తే 1 కిలోమీటరు దూరంలో ఉంటాను.. ఎరుపు బట్టల వైపు అస్సలు చూడను.. ఇక అప్పటి నించి ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా ఒక్కదాన్ని ఎక్కడికీ వెళ్ళలేదు ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళేదాన్ని.. ఇదండీ ఎర్ర గౌను అనుభవం ..

Thursday, December 31, 2009

ఇంగ్లీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఏంటో మనం అంతా మన తెలుగు పండగని మాత్రం ఇంత హంగామ చేసి జరపం కాని ఈ ఇంగ్లీషోళ్ళ పండగని మాత్రం చాలా హంగమా చేసేస్తుంటాం.... ఏం చేస్తాం అంతా కళికాలం... ఇంగ్లీషోళ్ళ పవర్ అలాంటిది... ఎంత ఐనా ఎంత హంగమా చేసినా మన తెలుగు పండగలా ఉంటుందా చెప్పండి ... ఎవో ఆటలు, పాటలు, కేకులు ఎంత చేసిన మన ఉగాది కి సరిపోవనుకోండి. సరేలెండి ఎన్ని అనుకున్నా ఏముందిలెండి మీ అందరికీ ఈ ఇంగ్లీష్ నూతన సంవత్సరం లో అన్ని శుభాలు జరగాలని, ఈ అర్ధికమాంద్యం నుంచి ఈ ప్రపంచం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ..

Tuesday, December 29, 2009

ఒక రోజు ఏమయిదంటే....

సాదారణంగా మన ఊర్లొ ఐతే ఎవరైనా మన ఇంటికి వొస్తే మంచినీళ్ళు, మజ్జిగ లేదా పళ్ళరసం ఇస్తాం.. అలసిపొయి వొస్తారేమో అని కాస్త సేద తీర్చుకోమని కదా...

కాని నేను మొదట అమెరికాకి వొచ్హినప్పుడు ఒక సహోద్యోగి వాళ్ళ ఇంటికి భోజననికి పిలిస్తే వెళ్ళాను.. ఇలా వెళ్ళగానే ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో వాళ్ళ అవిడ వొచ్హ్హి "would you like to have some wine" అంది అంతే నేను షాక్ .. ఇక్కడ ఈ ఫెసిలిటి కుడా ఉందా అని... ( మరి నేను వొచ్హింది తెల్లవాళ్ళ ఇంటికి కదా )

అప్పుడెదో సర్దుకున్నా కాని ఇక ఇంటికి వొచ్హాక అసలు నవ్వు ఆగలేదనుకోండి నాకు...

మొదటి టపా

ఎప్పటినుంచో ఒక బ్లాగు రాద్దమనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది మరి... సరే అని ఇలా మొదలెట్టా

ఇంతకీ ఎలా మొదలెట్టాలో ... ఏం రాయాలో ఇంకా ఆలోచించలేదండీ
మరి కాకీక కబుర్లు అని పేరెందుకంటారా... ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా ఒక సన్నివేశం మెరిసింది నా బుర్రలో అదేంటంటే అప్పుడెప్ప్పుడో చిన్న్నప్పుడు ఒక స్నేహితుడితో మాటల్లొ మాటగా ఒక పందెం వేసుకున్నాం ఏంటంటే ఒకే అక్షరం ఉపయొగించి ఒక వాక్యం చెప్పలి అని అలా అలోచిస్తూ ఉండగా ఉండగా కొన్ని వాక్యాలు మెరిసాయ్ బుర్రకాయలో అందులొ ఒకటే ఇది " కాకీక కాకికి కాక కుక్కకా ".. ఇంకోటి కూడ ఉందండోయ్ " నీ నూనె నా నూనెనని నేను నిన్నన్ననా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె " ........!!!!!!@@@@@######

ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక... కాకీక కబుర్లు అని నిర్ణయించుకొని ఈ పేరు కరారు చేసా అన్నమాట

అదండీ సంగతి ..
ఎవైనా తప్పులు దొర్లితే సాయం చేస్తారు కదూ!
--
ఇట్లు
మీ అనిత.